ఐసీసీ ర్యాంకింగ్: రెండు స్థానాలు మెరుగు పరుచుకున్న ధావన్

93
shikhar Dhawan

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని 16వ ర్యాంకుకు చేరుకున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 86 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధావన్ 712 రేటింగ్ పాయింట్లు సాధించి 16వ స్థానానికి చేరుకున్నాడు. ఇక పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (873) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో విరాట్ కోహ్లీ (848), మూడో స్థానంలో రోహిత్ శర్మ (817) ఉన్నారు.

భారత బౌలర్లలో యజువేంద్ర చాహల్ నాలుగు స్థానాలు మెరుగు పరుచుకొని 20వ ర్యాంకుకు చేరుకున్నాడు. శ్రీలంక బౌలర్ వానిందు హసరంగ 22 స్థానాలు పైకి ఎగబాకి 36వ స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల ముగిసిన జింబాబ్వే-బంగ్లాదేశ్ వన్డే సిరీస్, ఐర్లాండ్-దక్షిణాఫ్రికా మూడో మ్యాచ్, ఇండియా-శ్రీలంక రెండో వన్డే ముగిసిన తర్వాత రేటింగ్ పాయింట్లు కేటాయించి ఐసీసీ ర్యాంకులు ప్రకటించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..