కోల్‌కతాకు షారుక్ హెల్పింగ్ హ్యాండ్

by  |
కోల్‌కతాకు షారుక్ హెల్పింగ్ హ్యాండ్
X

బాలీవుడ్ బాద్ షా మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు. కరోనా కష్ట సమయంలో అండగా నిలిచిన ఆయనే.. ఇప్పుడు ఎంఫన్ తుఫాన్ కారణంగా కోల్‌కతాలో ఏర్పడ్డ దుర్భర పరిస్థితులు చూసి చలించిపోయి.. బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తన మీర్ ఫౌండేషన్, కోల్‌కతా నైట్ రైడర్స్ సంయుక్తంగా ఈ సహాయక చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అందమైన కోల్‌కతా నగరంతో తనకు చాలా అనుబంధం ఉందని, ఇక్కడి ప్రజలు తనపై కురిపించిన ప్రేమ మరిచిపోలేనన్న షారుక్.. ఈ కష్టం నుంచి గట్టెక్కేందుకు సహాయం అందించడం తన బాధ్యత అని తెలిపారు. కోల్ కతా అనేది నాకు ఒక ఎమోషన్ .. ఇక్కడే స్నేహం, ప్రేమ, సంతోషం కనుగొన్న.. కోల్ కతా నైట్ రైడర్స్ ఇదే ఈడెన్ గార్డెన్ లో ఎన్నో విజయాలు పొందింది.. అపజయాలు చవి చూసింది. కానీ చివర్లో నేను తెలుసుకున్నది ఒక్కటే .. ఏ కష్టం వచ్చినా అందరం కలిసి టీంగా నిలబడితే కచ్చితంగా జయం మనదే అని.

అందుకే ఈ సమయంలో కోల్ కతా కోసం అందరం కలిసి నిలబడదామని పిలుపునిచ్చారు షారుక్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించడంతో పాటు కోల్ కతా నైట్ రైడర్స్ సహాయతా వాహనం ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తానని తెలిపారు. నిరాశ్రయులైన యాసిడ్ ఎటాక్ బాధితులకు ఇళ్లు కట్టించేందుకు సహాయం అందిస్తామన్నారు. తుఫాన్ కారణంగా ఎక్కడికక్కడ చెట్లు నేలకొరగగా.. 5000 మొక్కలు తిరిగి నాటేందుకు ప్రతిజ్ఞ చేశారు షారుక్.



Next Story

Most Viewed