షర్మిల పార్టీ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

by  |
షర్మిల పార్టీ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పూర్తి అయిందని ఆ పార్టీ చైర్మన్ వాడుక రాజగోపాల్ సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి పత్రాలు రాగానే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని జులై8వ తేదీన పార్టీ ఆవిర్భావం ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రారంభించామని రాజగోపాల్ పేర్కొన్నారు.

వైయస్సార్ తెలంగాణ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం అభ్యంతరాలుంటే తెలపాలని సూచించిందని అయితే ఇప్పటివరకు ఎలాంటి అభ్యంతరాలు తమ దృష్టికి రాలేదని పార్టీ చైర్మన్ తెలిపారు. తెలంగాణలో తిరిగి వైయస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనను గడపగడపకు అందించడమే ధ్యేయంగా షర్మిల పార్టీ పెట్టినట్లు చెప్పారు. కాగా షర్మిల పార్టీ పేరును ప్రకటించిన నేపథ్యంలో వైఎస్ విజయమ్మ స్పందించారు. పార్టీ పేరుపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఓ లేఖలో తెలిపారు. ఆ లేఖను షర్మిల వర్గం ఈసీకి సమర్పించింది. రాజగోపాల్ సైతం పార్టీ పేరుపై విజయమ్మకు ఎలాంటి అభ్యంతరాలు లేవని మరోసారి స్పష్టం చేశారు.



Next Story

Most Viewed