తండ్రి బాటలో తనయ.. సెంటిమెంట్ ఫలించేనా ?

by  |
తండ్రి బాటలో తనయ.. సెంటిమెంట్ ఫలించేనా ?
X

దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్సార్​టీపీ చీఫ్​షర్మిల బుధవారం నుంచి తెలంగాణ లో పాదయాత్రను ప్రారంభించనున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తన తండ్రి సెంటిమెంట్​గా భావించే చేవెళ్ల నుంచి యాత్రను చేపట్టనున్నారు. ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్​విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం షర్మిల భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అనంతరం చేవెళ్ల, శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. ప్రతి రోజూ ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు పాదయాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. సుమారు 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు యాత్రను కొనసాగించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. 90 అసెంబ్లీ నియోజకవర్గాలు, 14 పార్లమెంట్​స్థానాల్లోని సమస్యలపై ఫోకస్​ పెట్టనున్నారు. ప్రభుత్వం నెరవేర్చని హామీలు, నిరుద్యోగులు, రైతుల సమస్యలనే ఎక్కువగా ప్రస్తావించనున్నారు. దీంతో పాటు తన తండ్రి బాటలోనే వైస్సార్​ టీపీ అధికారంలోకి వస్తే ఏయే పథకాలు అందుబాటులోకి వస్తాయో కూడా ఆమె వివరించనున్నారు.


Next Story

Most Viewed