అంతరించి పోతున్న ఆ జాతులు.. ఎందుకంటే ?

by  |
new
X

దిశ, ఫీచర్స్ : భూమ్మీద ఇప్పటికే ఎన్నో జీవజాతులు అంతరించిపోగా, మరెన్నో జంతువులు ప్రమాదంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచం వాతావరణ మార్పుల వల్ల సముద్ర జీవులు కూడా ప్రమాదంలో ఉన్నట్లు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) తాజాగా కొత్త నివేదిక వెల్లడించింది. కాగా వెల్లడించిన ‘రెడ్ అలర్ట్’ మహాసముద్రాల్లోని సొరచేప జాతులు అధిక ముప్పును ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. 37 శాతం సొరచేప జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నట్లు పేర్కొన్నారు.

అతిగా చేపలు పట్టడం వల్ల దాదాపు ఐదు సొరచేపల్లో రెండు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని ఐయూసీఎన్ (IUCN) వన్యప్రాణుల రెడ్ లిస్ట్ అప్‌డేట్‌లో హెచ్చరించింది. ఇండోనేషియాలోని కొమోడో డ్రాగన్స్ కూడా ముప్పు ముంగిట్లో ఉన్నట్లు తెలిపింది. మొత్తంమీద ‘నేచర్ వరల్డ్’‌పై మానవ కార్యకలాపాల విధ్వంసక ప్రభావం తీవ్రతరం కావడంతో 138వేల జాతుల్లో 28శాతం జీవజాతులు శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్నాయని తేల్చింది. ఆవాసాల నష్టం, వేటాడటం, అక్రమ వ్యాపారం వంటివి ప్రపంచ వన్యప్రాణుల జనాభాను దెబ్బతీయగా వాతావరణ మార్పు ప్రస్తుతం ప్రత్యక్ష ముప్పుగా పరిణమించింది. అయితే దశాబ్దాల ప్రయత్నాల తర్వాత ట్యూనా జాతులు రెడ్ లిస్ట్ నుంచి బయటపడటం విశేషం.

వాతావరణ మార్పు అనేక జాతుల భవిష్యత్తుపై, ముఖ్యంగా చిన్న జంతువులు, చిన్న ద్వీపాల్లో కొన్ని జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లలో ప్రత్యేకంగా నివసించే మొక్కల భవిష్యత్తుపై ఎక్కువగా ఉంది. రానున్న 45ఏళ్లలో సముద్ర మట్టాలు దాని చిన్న ఆవాసాలను కనీసం 30 శాతం కుదించే అవకాశం ఉందని నివేదికలో వెల్లడించారు.

Next Story

Most Viewed