కోచ్ మాట కాదని.. మనసులో మాట చెప్పిన శార్దుల్

by  |
కోచ్ మాట కాదని.. మనసులో మాట చెప్పిన శార్దుల్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పెవిలియన్‌లో ఉండే కోచ్ మైదానంలో ఉండే ఆటగాళ్లకు సందేశాలు పంపుతుంటారు. డ్రింక్స్ తీసుకెళ్లే ప్లేయర్లు.. ఆ సందేశాన్ని క్రికెటర్లకు అందిస్తుంటారు. కోచ్ ఏం చెప్తే అది యధాతథంగా చెప్పడం ఆ ఆటగాళ్ల పని. అయితే సిడ్నీ టెస్టులో మాత్రం అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. అశ్విన్, విహారి కలసి ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటున్నారు. పరుగులు రాకపోయినా క్రీజులో పాతుకొని పోయారు. ఆ సమయంలో కోచ్ రవిశాస్త్రి ఒక సందేశాన్ని శార్దుల్ ఠాకూర్‌కు చెప్పి పంపించాడు.

అయితే, డ్రింక్స్ తీసుకొని మైదానంలోకి వెళ్లిన ఠాకూర్ అసలు విషయం చెప్పకుండా తనకు తోచింది చెప్పి వచ్చాడంటా. రవిచంద్రన్ అశ్విన్ అసలు కోచ్ ఏం చెప్పాడు.. శార్దుల్ ఏం చెప్పాడనే విషయాన్ని తన యూట్యూబ్ చానల్‌లో వెల్లడించాడు. ‘శార్దుల్‌ని పిలిచి విహారిని ధాటిగా ఆడమను.. అశ్విన్‌ని డిఫెన్సీవ్‌గా ఆడమని చెప్పు అని రవిశాస్త్రి చెప్పాడు. డ్రింక్స్ తీసుకొచ్చిన శార్దుల్ మాత్రం.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏవేవో చెబుతున్నారు. కానీ మీరు మీ ఆటను ఇలాగే కొనసాగించండి. మీరు చాలా బాగా ఆడుతున్నారు’ అని చెప్పాడు అని అశ్విన్ అన్నాడు. శార్దుల్ అలా చెప్పి వెళ్లాక ఆసీస్ బౌలర్లను మేము మా శైలిలోనే అడ్డుకున్నాము. చివరకు సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసిందని అశ్విన్ అన్నాడు.

Next Story

Most Viewed