శభాష్ పోలీస్.. మహిళా పోలీస్‌పై నెట్టింట ప్రశంసలు

by  |
Inspector Rajeshwari
X

దిశ, డైనమిక్ బ్యూరో: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులంతా పనిచేస్తున్నారు. ఈక్రమంలో తమిళనాడులోని చెన్నై నగరంలో జరిగిన ఓ సంఘటన నెట్టింట చర్చనీయాంశమైంది.

చెన్నైలోకి కిల్పాల్ శ్మశానవాటికలో ఓ శవం ఉందని పోలీసులకు సమాచారం రావడంతో ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి కానిస్టేబుళ్లతో కలిసి అక్కడికి చేరుకుంది. అయితే ఆ వ్యక్తి ఇంకా చనిపోలేదని, అపస్మారక స్థితిలో ఉన్నాడని గుర్తించారు. వెంటనే, అప్రమత్తమైన ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి జోరుగా గాలులు వీస్తూ.. వర్షం కురుస్తున్నా పట్టించుకోకుండా ఆ 25 ఏళ్ల యువకుడిని తన భుజాన వేసుకుని ఆటో దగ్గరికి పరిగెత్తి అందులో పడుకోబెట్టి ఆసుపత్రికి తరలించింది.

ఇదంతా చూస్తున్న ప్రజలు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్ల నుంచి హర్షాతిరేకాలు వెళ్లువెత్తాయి. ఈ సందర్భంగా గత కొన్ని నెలల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ఎస్సై శిరీషను గుర్తు చేసుకుంటున్నారు నెటిజెన్లు. విధి నిర్వహణలో దేనికి వెనకాడని మహిళా పోలీసులందరికీ సలాం అంటూ ట్వీట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed