ఆఫీస్‌కు కరోనా పేషెంట్.. ఏడుగురి మృతి!

by  |
Corona positive
X

న్యూయార్క్: కరోనా వైరస్ ఓ అంటు రోగం. మాస్కు ధరించండి. శానిటైజర్ వాడండి. అనారోగ్యానికి గురైతే క్వారంటైన్‌లో ఉండండి. మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి నెత్తినోరు మొత్తుకుని చెబుతున్నారు. అయినా జనాల్లో మాత్రం మార్పు లేదు. నిబంధనలు పాటించకుండా మహమ్మారి వ్యాప్తికి కారణమవుతున్నారు. సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారు. ఇక అమెరికాలోనైతే ‘సూపర్ స్ప్రెడర్ ఈవెంట్‌‌‌’లను జరుపుకుంటున్నారు. ఇలాంటి ఈవెంట్లు ఏవీ జరపకుండానే ఓ వ్యక్తి సూపర్ స్ప్రెడర్‌గా మారాడు. కరోనా సోకిందని తెలిసీ ఆఫీస్‌కు వెళ్లడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 300 కుటుంబాలు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది.

కరోనా మహమ్మరి వ్యాప్తితో దక్షిణ ఒరెజిన్ కమ్యూనిటీలో ఏడుగురు మృతిచెందగా, వైరస్ బారిన పడ్డామనే ఆందోళనలతో వందల కుటుంబాలు క్వారంటైన్‌లోకి వెళ్లాయి. అమెరికాలో సూపర్ స్ప్రెడర్ ఈవెంట్‌లను నిర్వహించి ఓ కమ్యూనిటీ మొత్తం కరోనా బారిన పడుతుంటుంది. ఇలాంటి ఈవెంట్లు మరణాలకు కారణమవుతుంటాయి. అయితే, ఒరెజిన్ కమ్యూనిటీ మాత్రం ఎలాంటి ఈవెంట్లు నిర్వహించలేదు. అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి ఆఫీస్‌కు వెళ్లడంతో సూపర్ స్ప్రెడర్‌కు కారణమైనట్లు ప్రజారోగ్యశాఖ అధికారులు తెలిపారు.

తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని తెలిసి కూడా ఓ ఉద్యోగి విధులకు హాజరయ్యాడు. ఆ తర్వాత నిర్వహించిన టెస్టులో అతడికి పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత ఒక్కో ఉద్యోగిని ట్రేస్ చేయగా, వందల కుటుంబాలు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు తేలింది. ఈ వ్యాప్తితో ఏడుగురు ప్రాణాలను కోల్పోయారని, 300 కుటుంబాలు క్వారంటై‌న్‌లో ఉన్నట్లు డౌగ్లస్ కంట్రీ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ తెలిపారు. ప్రస్తుతం ఒరెజిన్ కమ్యూనిటీ ప్రజలు పడుతున్న బాధను మనం ఊహించలేమన్నారు.

Next Story

Most Viewed