డాలర్ల కుంభకోణంలో శేషాద్రి..

by srinivas |
Seshadri
X

దిశ, ఏపీ బ్యూరో: 2006లో డాలర్ శేషాద్రిపై బంగారు డాల్లర్ల మిస్సింగ్ అభియోగాలు వచ్చాయి. దాదాపు 305 డాలర్లు మాయమవ్వడంతో తీవ్ర కలకలం రేగింది. దీనిపై వెంటనే స్పందించిన టీటీడీ బోర్డు శేషాద్రితో పాటు మరో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. అంతేకాదు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. అయితే విచారణలో డాలర్ శేషాద్రికి క్లీన్ చిట్ లభించింది. దీంతో ఆయన మళ్లీ విధుల్లో చేరిపోయారు. 2009లో అప్పటి ఈవో కృష్ణారావు ఆదేశాల మేరకు 9 నెలలు విధులకు దూరమైన శేషాద్రి తిరిగి కోర్టు ఆదేశాలతో విధుల్లో చేరారు. మొత్తం సర్వీసులో 15 నెలల కాలం మినహాయిస్తే పూర్తిగా శ్రీవారి సన్నిధిలో డాలర్ శేషాద్రి విధుల నిర్వర్తించారు. సామాన్యుల నుంచి వీవీఐపీల వరకు అందరికీ ఆయన సుపరిచితుడిగా ఉండేవారు.



Next Story

Most Viewed