"స్టే హోమ్"… సీరియల్ నటుల షార్ట్ ఫిల్మ్

by  |
స్టే హోమ్… సీరియల్ నటుల షార్ట్ ఫిల్మ్
X

“ఫ్యామిలీ” అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా ఇండియన్ సినిమా ఒక్కటే అని చాటారు సినీ ప్రముఖులు. దాదాపు అన్ని భాషలకు చెందిన దిగ్గజ నటులు ఈ షార్ట్ ఫిల్మ్ లో కనిపించి… కరోనా కష్ట కాలంలో నిరుపేద కళాకారులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఒక సినిమా కోసం తెరవెనుక కష్టపడే సినీ కార్మికులు కూడా మా కుటుంబ సభ్యులే అని చాటి చెప్పారు. వారి ప్రేరణతో కరోనా పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ” స్టే హోమ్” అనే లఘు చిత్రాన్ని చేశారు సీరియల్ నటులు. 34 మంది దక్షిణాది పరిశ్రమకు చెందిన నటులు 29 ఇళ్ల నుంచి నటించారు. అంటే ఇంటి నుంచి బయిటకు రాకుండా వర్క్ ఫ్రమ్ హోం చేశారు అన్న మాట.

లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే… కరోనా వైరస్ సోకుతుంది… ఒక్కరు బయటకు వెళ్తే ఇంట్లో అందరూ ఆ మహమ్మారి బారిన పడి బాధపడాల్సి వస్తుంది… అలా కాకుండా ఇంట్లోనే ఉండి ఇంటిని శుభ్రపరుచుకోవాలి అని… ఈ సమయాన్ని ఎంజాయ్ చేయాలని ఈ లఘు చిత్రం ద్వారా సందేశాన్ని ఇచ్చారు. కాగా ఈ షార్ట్ ఫిల్మ్ ను 5 భాషల్లో చిత్రీకరించారు. రవి కిరణ్ దర్శకత్వంలో వచ్చిన ” స్టే హోమ్” లో ఎస్పీ బాలు, పరుచూరి గోపాల కృష్ణ నటించడం విశేషం.

tags : Stay Home, SP Balu, Paruchuri Gopalakrishna, Short Film

Next Story

Most Viewed