పతనం నుంచి పుంజుకున్న మార్కెట్లు!

by  |
పతనం నుంచి పుంజుకున్న మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లపై కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. శుక్రవార ముదయం ప్రారంభమైన మార్కెట్లు కరోనా కోరల్లో చిక్కున్నాయి. 2008 నాటి మార్కెట్ల సంక్షోభం మళ్లీ చూసినట్టుగా ఉందని విశ్లేషకులు భావించారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ మార్కెట్లు సైతం విలవిల్లాడాయి. ఉదయం ప్రారంభమైన తర్వాత ప్రధాన సూచీలన్నీ నష్టాల బాటలో అధఃపాతాళానికి పడిపోయాయి. దీంతో స్టాక్ మార్కెట్లను 45 నిమిషాలపాటు నిలిపేశారు. ట్రేడింగ్ బ్రేక్ అనంతరం పునః ప్రారంభమైన మార్కెట్లు కాస్త కోలుకున్నాయి. భారీ పతనాన్ని చూసిన తర్వాత నెమ్మదిగా రికవరీ అయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1325.34 పాయింట్ల అధిక లాభాలతో 34,103 వద్ద క్లోజయింది. నిఫ్టీ సైతం 433.50 పాయింట్ల అత్యధిక రికవరీతో 10,023 ను దాటింది.

నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీలు 0.8 శాతం పెరగ్గా, మిడ్‌క్యాప్ సూచీలు 2.5 శాతం పెరిగాయి. మీడియా మినహా అన్ని రంగాలు పాజిటివ్‌గానే నమోదయ్యాయి. మెటల్, బ్యాంక్ రంగాలు 5 శాతం వరకూ లాభపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎస్‌బీఐ, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా, బజాజ్ ఫినాన్స్, భారతీ ఎయిర్‌టెల్, ఐసిఐసిఐ, ఓఎన్‌జీసీ షేర్లు అత్యధిక లాభాలను నమోదు చేయగా, నెస్లె ఇండియా, ఏషియన్ పెయింట్స్, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు నష్టాలను చవిచూశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకమ విలువ రూ. 73.99 వద్ద ట్రేడైంది.

Tags: sensex, nifty, BSE, NSE, stock market


Next Story

Most Viewed