నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

by  |
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో పలు దిగ్గజ కంపెనీల ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోవడంతో సూచీలు ఉదయం నుంచే ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు లేకపోవడంతో వారం ప్రారంభంలోనే మార్కెట్ల ట్రేడింగ్ ఆద్యంతం లాభనష్ఠాల మధ్య ర్యాలీ చేశాయి. అయితే, చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి అధికం కావడంతో స్టాక్ మార్కెట్లు నష్టాలను ఎదుర్కొనక తప్పలేదు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో రంగాల్లో అమ్మకాలు పెరిగాయి. మెటల్, హెల్త్‌కేర్ రంగాల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 123.53 పాయింట్లు కోల్పోయి 52,852 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 31.60 పాయింట్లు నష్టపోయి 15,824 వద్ద ముగిసింది.

నిఫ్టీలో రియల్టీ ఇండెక్స్ 1 శాతం వరకు పతనమవగా, బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు నీరసించాయి. మెటల్, ఫార్మా, ఐటీ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, ఆల్ట్రా సిమెంట్, సన్‌ఫార్మా, టైటాన్, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఎస్‌బీఐ, రిలయన్స్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, ఎల్అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.43 వద్ద ఉంది.

Next Story

Most Viewed