కరోనా భయంలో మార్కెట్లు.. కొనసాగుతున్న నష్టాలు!

by  |
కరోనా భయంలో మార్కెట్లు.. కొనసాగుతున్న నష్టాలు!
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ భయం మార్కెట్లను వీడటంలేదు. చైనాను దాటి ఇతర దేశాల్లో కరోనా మరణాలు పెరుగుతుండటమే దీనికి కారణం. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లను నష్టాల్లోకి పడేస్తోంది. బుధవారం సెన్సెక్స్ 40,000 దిగువకు చేరుకోగా నేడు 39,500 దిగువకు పడిపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 405.89 పాయింట్ల నష్టంతో 39,483 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 127.80 పాయింట్లను కోల్పోయి 11,550 వద్ద ట్రేడవుతోంది. వరుసగా ఐదు రోజులుగా మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఎస్‌బీఐ కార్డులు, సేవల కారణంగా నిలకడగా కదులుతోంది. గురువారం సన్‌ఫార్మా, టైటాన్, కోటక్ మహీంద్రా మాత్రమే స్వల్పంగా లాభాలను చూడగలుగుతున్నాయి. మిగిలిన సూచీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇక నిఫ్టీలోని అన్ని రంగాలు నష్టాల్లోనే కదలాడుతున్నాయి.

Next Story