ఇంట్రాడే గరిష్ఠాలు తాకిన సూచీలు

by  |
ఇంట్రాడే గరిష్ఠాలు తాకిన సూచీలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం మెరుగైన లాభాలను సాధించాయి. అంతకుముందు సెషన్‌లోని ప్రతికూలతను ఉదయం కొనసాగించినప్పటికీ, మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రాడే గరిష్ఠాలను అందుకున్నాయి. అన్ని రంగాల్లో సానుకూల ధోరణి కారణంగా మార్కెట్లు శుక్రవారం లాభాలతో పుంజుకున్నాయి. కంపెనీల మెరుగైన ఆదాయాలకు తోడు మెటల్, ఫార్మా, ఐటీ వంటి కీలక రంగాలు అధిక లాభాలను చూడటంతో మార్కెట్లు గణనీయమైన లాభాలను దక్కించుకున్నాయి.

చివర్లో పెట్టుబడిదారులు మరింత దూకుడుగా కొనుగోళ్లను నిర్వహించడంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 175.62 పాయింట్లు ఎగసి 56,124 వద్ద ముగియగా, నిఫ్టీ 68.30 పాయింట్లు పెరిగి 16,705 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ అధికంగా 1.6 శాతం దూసుకెళ్లగా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, మీడియా, ఐటీ, ఫైనాన్స్ రంగాలు స్వల్పంగా పెరిగాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఆల్ట్రా సిమెంట్, ఎల్అండ్‌టీ, డా రెడ్డీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, సన్‌ఫార్మా, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ బ్యాంక్ షేర్లు అధిక లాభాలను సాధించాయి. ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, నెస్లె ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.59 వద్ద ఉంది.

Next Story

Most Viewed