లాభాల్లో ట్రేడవుతున్న మార్కెట్లు!

by  |
లాభాల్లో ట్రేడవుతున్న మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస నష్టాలతో సతమతమవుతున్న మార్కెట్లకు కొంత ఊరట లభించింది. సోమవారం అధిక నష్టాలను చూసిన స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యయి. కరోనా మహమ్మారి పుట్టిన చైనాలో సాధారణ పరిస్థితులు నెలకొని, పంపిణీ వ్యవస్థ గాడిలోకి పడుతోందనే వార్తలతో మార్కెట్లకు సానుకూల సంకేతాలు వచ్చాయి. ఇప్పటికే సుమారు 30 శాతం కర్మాగారాలు తమ ఉత్పత్తిని ప్రారంభించాయి. ప్రధానంగా ప్రపంచ మార్కెట్లకు అవసరమైన మెటల్ రంగంలోని సూచీలు లాభాలను నమోదు చేస్తున్నాయి. ఈ రంగం షేర్లు సుమారు 4 శాతం లాభాలను చూస్తున్నాయి. ఈ పరిణామాలతో దేశీయ మార్కెట్లు సైతం లాభాలతోనే మొదలయ్యాయి. ఉదయం 10.30 సమయానికి సెన్సెక్స్ 647.23 పాయింట్ల లాభంతో 29,087 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 196.75 పాయింట్లు లాభపడి 8,477 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఆరు సూచీలు మినహా మిలిన షేర్లన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి..ఇండస్ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 17 శాతం నష్టంతో ట్రేడవుతోంది.

Tags : sensex, nifty, BSE, NSE, stock market


Next Story