వరుసగా రెండో రోజూ దూసుకెళ్లిన మార్కెట్లు

by  |
వరుసగా రెండో రోజూ దూసుకెళ్లిన మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: పెట్టుబడిదారులు (Investors) కొనుగోళ్లకు సిద్ధమవడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Domestic equity markets) వరుసగా రెండో రోజు అధిక లాభాలను నమోదు చేశాయి. మంగళవారం ఉదయం ప్రారంభంలోనే పటిష్టంగా మొదలైన సూచీలు (index) చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. భారత జీడీపీ (Indian GDP)ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (Financial year) తొలి త్రైమాసికంలో 16.5 శాతం తగ్గుతుందని ఎస్‌బీఐ (SBI) నివేదిక తెలిపింది.

ఈ ఏడాది ప్రారంభంలో జీడీపీ (GDP) సంకోచం 20 శాతం అంచనా నుంచి తగ్గించడంతో మార్కెట్లు (Markets) సానుకూలంగా ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు (Market analysts) అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు (Markets)ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex) 477.54 పాయింట్లు లాభపడి 38,528 వద్ద ముగియగా, నిఫ్టీ (Nifty)138.25 పాయింట్లు ఎగిసి 11,385 వద్ద ముగిసింది. నిఫ్టీలో ముఖ్యంగా అన్ని రంగాలు పుంజుకున్నాయి.

రియల్టీ (Realty) అత్యధికంగా 4 శాతం బలపడగా, బ్యాంక్ నిఫ్టీ (Bank Nifty), మెటల్ (Metal), ఎఫ్ఎంసీజీ (FMCG), ఆటో (Auto), మీడియా రంగాలు (Media sectors) సానుకూలంగా కదలాడాయి. ఫార్మా రంగం (Pharma sector) మాత్రమే స్వల్పంగా బలహీనపడింది.

సెన్సెక్స్ ఇండెక్స్‌ (Sensex Index)లో అల్ట్రా సిమెంట్ (Ultra cement), కోటక్ బ్యాంక్ (Kotak Bank), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), టాటా స్టీల్ (Tata Steel), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), ఏషియన్ పెయింట్ (Asian paint), టైటాన్ (Titan), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), మారుతి సుజుకి (Maruti Suzuki) షేర్లు (Shares)లాభాల్లో ట్రేడవ్వగా, టెక్ మహీంద్రా (Tech Mahindra), హెచ్‌సీఎల్ (HCL), బజాజ్ ఆటో (Bajaj Auto), పవర్‌గ్రిడ్ (Power Grid), సన్‌ఫార్మా (Sun Pharma), ఎన్‌టీపీసీ (NTPC) షేర్లు (Shares)ప్రతికూలతలను నమోదు చేశాయి.


Next Story

Most Viewed