మళ్లీ అదే తీరు..నష్టాలతో మొదలైన మార్కెట్లు!

by  |
మళ్లీ అదే తీరు..నష్టాలతో మొదలైన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: పైకి వెళ్లడం, కిందకు దిగడం. గత నెలరోజులుగా మార్కెట్ల పరిస్థితి ఇదే. గత వారం భారీ నష్టాలను చూసిన మార్కెట్లు మంగళవారం కాస్త కోలుకున్నప్పటికీ బుధవారం నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా కరోనా వ్యాప్తి కొనసాగడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం ఉంటుందనే ఐక్యరాజ్య సమితి హెచ్చరికలతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ సంకేతాల నేపథ్యంలో దేసీయ మార్కెట్లు ఊగిసలాటలో నష్టాలను నమోదు చేస్తున్నాయి.

ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 705.43 పాయింట్ల నష్టంతో 28,763 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 211.95 పాయింట్లు నష్టపోయి 8,385 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో దాదాపు అన్ని సూచీలు నష్టాలనే నమోదు చేస్తున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్, మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Tags : sensex, nifty, BSE, NSE, stock market


Next Story

Most Viewed