మార్గదర్శకానికి 100 స్టార్టప్‌ల ఎంపిక

by  |
మార్గదర్శకానికి 100 స్టార్టప్‌ల ఎంపిక
X

దిశ, న్యూస్‌బ్యూరో: స్టార్టప్‌లను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సమన్వయంతో రెజిగ్ హైదరాబాద్ స్టార్టప్స్ ముందుకొచ్చింది. మార్గదర్శకాలుగా నిలిచేందుకు వచ్చిన 300 దరఖాస్తుల నుంచి 100స్టార్టప్‌లను ఎంపిక చేసింది. కరోనా సంక్షోభంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి స్పందన లభించింది. వాటిలో నుంచి కొన్నింటిని ఎంపిక చేసింది. ప్రధానంగా లైఫ్ సైన్సెస్, ఫిన్ టెక్, మ్యానుఫక్చరింగ్, అగ్రికల్చరల్, ఎమెర్జింగ్ టెక్నాలజీ వంటి రంగాలకు సంబంధించినవి ఉన్నాయి.

వెబినార్ ద్వారా సోమవారం ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. స్టార్టప్ లకు మద్దతు తెలిపేందుకు రెజిగ్ హైదరాబాద్ స్టార్టప్స్ ముందుకొచ్చిందని, సంక్షోభంలోనూ హైదరాబాద్ నిలిచిందన్నారు. వెబినార్‌ను ఐకేపీ నాలెడ్జ్ పార్కు సీఈఓ దీపన్విత ఛటోపాధ్యాయ సమన్వయం చేశారు. వెబినార్‌లో సంక్షోభ సమయంలోనూ ప్రత్యామ్నాయ మార్కెట్ గుర్తించాలని వక్తలు చెప్పారు. టి.హబ్ సీఈఓ రవి నారాయణ్, సీటీఆర్ ఎల్ ఎస్ డేటా సెంటర్స్ వ్యవస్థాపక చైర్మన్ శ్రీధర్ పిన్నపురెడ్డి, టీఐటీ హైదరాబాద్ ప్రెసిడెంట్ సతీష్ ఆండ్రాలు మాట్లాడారు.

Next Story