- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- ఆరోగ్యం
- స్పోర్ట్స్
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫోటోలు
- జిల్లా వార్తలు
- భక్తి
దిశ, భద్రాచలం అర్బన్ : భద్రాచలంలో అక్రమ ఇసుక రవాణాకి అడ్డుకట్టపడటం లేదు. అక్రమార్కులు అధికారుల కన్నుగప్పి జోరుగా రేయింబవళ్ళు గోదావరి నుంచి ఇసుక రవాణాచేసి అమ్ముకొని లాభాలు గడిస్తున్నారు. పోలీసులు పట్టుకొని కేసులు పెట్టినా చీకటి వ్యాపారుల తీరు మారడం లేదు. కొందరు ప్రభుత్వ అభివృద్ధి పనుల మాటున అనుమతులు పొంది యదేచ్ఛగా ఇసుక రవాణా చేస్తూ బయట వ్యక్తులకు అమ్ముతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో భద్రాచలం టౌన్ పోలీసులు నిఘా పెట్టారు. ఎలాంటి అనుమతిలేకుండా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ ని పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. అనుమతిలేకుండా ఇసుక తరలిస్తే కేసు నమోదు చేస్తామని ఎస్ఐ మధు ప్రసాద్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకి అడ్డుకట్ట వేయడం కోసం నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Next Story