రూ.10 లక్షల నిషేధిత అంబర్ ప్యాకెట్ల పట్టివేత

by  |
రూ.10 లక్షల నిషేధిత అంబర్ ప్యాకెట్ల పట్టివేత
X

దిశ, పాలేరు: కూసుమంచి మండల పరిధిలోని పాలేరు రిజర్వాయర్ అలుగుల వద్ద గురువారం ఉదయం రూ.10 లక్షల విలువ చేసే అంబర్ ప్యాకెట్లను కూసుమంచి ఎస్సై యాస నందీప్, టాస్క్‌ఫోర్స్ ఎస్సై ప్రసాద్ కలిసి పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఉదయం సుమారు 8 గంటల సమయంలో పాలేరు అలుగుల వద్ద టాస్క్‌ఫోర్స్, కూసుమంచి పోలీసులు సంయుక్తంగా వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా వస్తున్న ఏపీ11ఎబి2509 నెంబరు గల టాటా ఇండిగో కారును అపి తనిఖీ చేయగా.. డిక్కీలో అక్రమంగా నిషేధిత అంబర్ ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు.

20 సంచుల్లో దాదాపు రూ.10లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న కొత్తగూడెంకు చెందిన సయ్యద్ జాఫర్ పాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా మహారాష్ట్రలో బీదర్ నుండి చత్తీస్ ఘఢ్‌లోని కుంటకు వీటిని తరలిస్తున్నట్లు తెలిపారని వివరించారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీన పర్చుకొని, కారును సీజ్ చేశారు. నిందితుడిపై కూసుమంచి ఎస్సై నందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది హమీద్, రామారావు, సూర్యనారాయణ, కూసుమంచి ఏ ఎస్సై శ్రీధర్, కానిస్టేబుల్ కృష్ణ, మహిళ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed