భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ

by  |
భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ
X

భద్రాచలం టౌన్ : భద్రాచలం వద్ద గోదావరి 48 అడుగులకు చేరుకోవడంతో జిల్లా కలెక్టర్ అనుదీప్ రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ ఉదయం 8 గంటల సమయంలో గోదావరి 43 అడుగుల దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద మూలంగా భద్రాచలం వద్ద గంట గంటకు వరద పెరుగుతోంది. జిల్లా కలెక్టర్ అనుదీప్ భద్రాచలంలో మకాం చేసి వరద సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. భద్రాచలంలో వరద బాధితుల కోసం 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అశోక్ నగర్ కాలనీ వాసులను నన్నపునేని పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. ఇక్కడ సుమారు 100 మంది వరద బాధితులకు భోజన సదుపాయం, త్రాగునీరు ఏర్పాటు చేశారు. శిబిరంలో వరద బాధితులకు కరోనా టెస్టులు నిర్వహించారు.



Next Story

Most Viewed