గవర్నర్‌ను కలిసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

50

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో ఎస్ఈసీ భేటీ అయ్యారు. పంచాయితీ ఎన్నికలు, తాజా పరిణామాలపై గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. తాను ఏ ఉద్దేశంతో నోటిఫికేషన్ ఇచ్చాననే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు ఎస్ఈసీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సహకరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎస్‌ఈసీ కోరినట్లు తెలుస్తోంది.