బొలివియాలో ఐదు కొత్త మొక్క జాతులు గుర్తించిన సైంటిస్ట్స్

by  |
బొలివియాలో ఐదు కొత్త మొక్క జాతులు గుర్తించిన సైంటిస్ట్స్
X

దిశ, ఫీచర్స్ : జాక్వెమోంటియా జాతికి చెందిన బొలీవియన్ అండీస్‌లో ఐదు కొత్త పుష్పించే మొక్క జాతులను యూకే పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 జాక్వెమోంటియా జాతులు ఉన్నాయి. జాక్వెమోంటియా మొక్కలు సాధారణంగా బహిరంగ ప్రాంతాలు లేదా పొద, గడ్డి ప్రాంతాలలో కనిపిస్తుంటాయి. జాతులను రకాన్ని బట్టి 30 – 100 సెంటీమీటర్ల ఎత్తులో పెరుగుతాయి.

బీచ్ క్లస్టర్‌విన్, రిక్లైన్డ్ క్లస్టర్‌విన్, బీచ్ జాక్వెమోంటియా పేర్లతోనే వీటిని పిలుస్తారు. ఫ్లోరిడా, యునైటెడ్ స్టేట్స్‌లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే అంతరించిపోతున్న జాబితాలో ఈ మొక్కలు కూడా ఉన్నాయి. అయితే జాక్వెమోంటియాలో ఐదు కొత్తరకం మొక్కలను బొలివియాలోని అండీస్ ప్రాంతంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. బొలివియా వైవిధ్యమైన మొక్కలకు ప్రసిద్ది కాగా, బొలీవియా, పెరూలో నివసించే 28 జాతులను యూకే శాస్త్రవేత్తల బృందం వర్గీకరించింది. ఇక కొత్తగా కనుగొన్న వాటిని జె. బొలివియానా, జె. కుస్పిడాటా, జె. లాంగిపెడున్కులాటా, జె. మైరే, జె. చుక్విసాసెన్సిస్‌‌గా నామకరణం చేశారు. జాక్వెమోంటియా జాతులు చాలావరకు స్థానికమైనవి కాగా ఇవి ఇతర మొక్కలు, మానవ చర్యల వల్ల ముప్పును ఎదుర్కొంన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఇక 5 మొక్కల్లో జె. బొలివియానాను అంతరించిపోతున్నట్లుగా, జె. చుక్విసాసెన్సిస్‌ను వలెనరబుల్‌‌గా గుర్తించారు. జె. కుస్పిడాటా, జె. లాంగిపెడున్కులటా జాతులను తీవ్రంగా ప్రమాదంలో ఉన్నట్లు వర్గీకరించాలని సూచించింది. కానీ ఈ రెండు జాతుల గురించి పెద్దగా ఏమీ తెలియదు కాబట్టి, రచయితలు వాటిని డేటా డెఫిషియంట్ విభాగంలో ఉంచారు.

మొక్కలను గుర్తించడంతో పాటు, వీటి ఆవాసాల గురించి, విస్తృత పర్యావరణ వ్యవస్థలలో అవి పోషిస్తున్న పాత్ర గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాం. జాక్వెమోంటియా మొక్కలు చాలా కఠినమైన పరిస్థితులలో జీవించగలవు కాబట్టి వాతావరణ మార్పులకు అవి ఎలా స్పందిస్తున్నాయో తెలుసుకోవడం ద్వారా మనం కూడా వాటి నుంచి నేర్చుకుని క్లైమేట్ చేంజ్‌కు అనుగుణంగా ఉండవచ్చు. దక్షిణ అమెరికా‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వేగంగా జీవవైవిధ్య నష్టం జరుగుతుండటంతో కొత్త మొక్కల జాతులను గుర్తించడం వల్ల వాటిని రక్షించేందుకు కృషి చేయొచ్చు. మొక్క జాతి ఏమిటో తెలియకపోతే, దానిని పరిరక్షించలేం. ఇప్పటికీ ఎన్నో ప్లాంట్ స్పీసియెస్ గుర్తించలేమని, ముఖ్యంగా ఉష్ణమండలంలోని చాలా జాతులు గుర్తించకపోవడంతో పాటు వర్గీకరించలేకపోయాం’ -శాస్త్రవేత్తల బృందం



Next Story