ప్రపంచంలోనే స్వచ్ఛమైన గాలి దొరికేది ఎక్కడంటే?

by  |
ప్రపంచంలోనే స్వచ్ఛమైన గాలి దొరికేది ఎక్కడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉదయాన్నే ఫ్రెష్ ఎయిర్ కోసం కిటికీలు, తలుపులు తెరుస్తాం. మరింత స్వచ్ఛమైన గాలి కోసం గార్డెన్‌కు వెళతాం. కానీ, మనం పీల్చే గాలంతా ఫ్రెష్ ఎయిర్ కావచ్చు, కాకపోవచ్చు. వెహికల్స్ నుంచి వచ్చే పొగ, ఫ్యాక్టరీలు వెలువరించే కాలుష్య కారకాలు, ఇళ్లలో, వీధుల్లో కాల్చే చెత్త.. ఇలా చాలారకాలుగా ఎయిర్ క్వాలిటీ దెబ్బతినడం సహజం. మరి ప్యూర్ ఎయిర్ ఎక్కడ దొరుకుతుంది? అంటే.. దానికి సమాధానంగా కొలరాడో స్టేట్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఓ ప్రాంతాన్ని గుర్తించారు. మంచుఖండమైన ‘అంటార్కిటికా’కు చుట్టూ ఉండే దక్షిణ మహా సముద్ర ప్రాంతంలో ప్రపంచంలోనే స్వచ్ఛమైన గాలి లభిస్తుందట. ఎందుకంటే.. అక్కడ మనుషులు పడేసే చెత్త లేదు, ఫ్యాక్టరీలు విడుదల చేసే వ్యర్థాలు, కెమికల్స్ కలవడం లేదు, ప్లాస్టిక్ వేస్టేజ్‌లేనే లేదు. అందుకే అక్కడ ఎయిర్ క్వాలిటీ బాగుందని వారు చెబుతున్నారు.

సాధారణంగా సముద్ర ఉపరితలానికి 6,500 అడుగుల ఎత్తులోనే ‘క్యుములోనింబస్‌’ మేఘాలు ఉంటాయి. సముద్రం నుంచి ఈ మేఘాల్లోకెళ్లే గాలిలోని బ్యాక్టీరియాను డీఎన్‌ఏ సీక్వెన్సింగ్‌, సోర్స్‌ ట్రాకింగ్‌, విండ్‌ బ్యాక్‌ ట్రాజెక్టరీస్‌ వంటి సాంకేతిక పద్ధతులతో శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఈ పరీక్షల్లో మహాసముద్రం పరిసరాల్లోని గాలి అత్యంత స్వచ్ఛంగా ఉన్నట్లు వెల్లడైంది. ప్రతి సంవత్సరం దాదాపు 7 మిలియన్ల ప్రజలు ఎయిర్ పొల్యూషన్‌ కారణంగా చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఎయిర్ పొల్యూషన్ వల్ల హార్ట్ డిసీజెస్, హార్ట్ స్ట్రోక్, లంగ్ కేన్సర్ వచ్చే ముప్పు ఎక్కువని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది.

Next Story

Most Viewed