నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు ఓపెన్

by  |
నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు ఓపెన్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ కానున్నాయి. ఉపాధ్యాయులు, అధ్యాపకులు నేటి నుంచి విధులకు హాజరుకానున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మార్చిలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. అయితే కరోనా తీవ్రత తగ్గడంతో జులై 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా నేటి నుంచి ఉపాధ్యాయులు, అధ్యాపకులు విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

మూడు నెలల తర్వాత పాఠశాలలు, కళాశాలలను తెరుస్తుండటంతో.. విద్యాసంస్ధల ఆవరణలను శానిటైజ్ చేయించాలని అధికారులకు ప్రభుత్వం తెలిపింది. అటు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ తరగతులకు సన్నాహాలు చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులను చేర్చేలా ప్రోత్సహించాలని విద్యాశాఖ సూచించింది. తల్లిదండ్రులకు ఇష్టముంటేనే స్కూళ్లకు పంపాలని, లేకపోతే ఆన్ లైన్ ద్వారా కూడా క్లాసులు నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే స్కూళ్లు ఓపెన్ చేయాలనే ప్రభుత్వం నిర్ణయంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇంత హడావుడిగా ఎలాంటి గైడ్‌లైన్స్ లేకుండా స్కూళ్లు ఎందుకు ఓపెన్ చేస్తున్నారని ప్రశ్నించింది. మూడో వేవ్ ముప్పు ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్న నేపథ్యంలో స్కూళ్లు ఓపెన్ చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో పూర్తి గైడ్‌లైన్స్ సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను జులై 7కి వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలతో త్వరలో విద్యాశాఖ విధివిధానాలు రూపొందించనుంది.

Next Story

Most Viewed