- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సొంతూరికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. ఘనస్వాగతం పలికిన నేతలు..

X
దిశ, ఏపీ బ్యూరో : భారతదేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సొంతూరులో పర్యటిస్తున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం చేరుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు పొన్నవరం గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఎడ్లబండిపై ఊరేగించారు. ఆ తర్వాత గ్రామంలోని శివాలయంకు వెళ్లారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇకపోతే సీజేఐ దంపతులను రాష్ట్రమంత్రులు మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, మొండి తోక జగన్మోహన్ రావు, భూమన కరణాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మొండి తోక అరుణ్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు.
- Tags
- Justice Ramana
Next Story