సత్యదేవ్‌ 'తిమ్మరుసు' ఫస్ట్‌ లుక్

by  |
సత్యదేవ్‌ తిమ్మరుసు ఫస్ట్‌ లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతూ.. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు నటుడు సత్యదేవ్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’ ట్యాగ్‌లైన్. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరుతో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై శ్రుజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను శనివారం చిత్రబృందం విడుదల చేసింది. అంతేగాకుండా ఈనెల 9న టీజర్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అనంతరం చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… సత్యదేవ్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు. సత్యదేవ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది అని వెల్లడించారు. సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యిందని, వచ్చే నెల విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నాం అని అన్నారు.

Next Story