ఈ రాశివారికి సహనమే విజయానికి సూచిక.. ఈ రాశి వారికి సూపర్..

by  |

తేది : 25, సెప్టెంబర్ 2021
ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : శనివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : చవితి (నిన్న ఉదయం 8 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 38 ని॥ వరకు)
నక్షత్రం : భరణి (నిన్న ఉదయం 8 గం॥ 57 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 35 ని॥ వరకు)
యోగము : హర్షణము
కరణం : బాలవ
వర్జ్యం : ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 6 గం॥ 15 ని॥ నుంచి 8 గం॥ 1 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 7 గం॥ 41 ని॥ నుంచి 8 గం॥ 29 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 6 ని॥ నుంచి 10 గం॥ 36 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మధ్యాహ్నం 1 గం॥ 38 ని॥ నుంచి 3 గం॥ 8 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 5 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 10 ని॥ లకు
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : మేషము

మేష రాశి : ఆఫీసు పనిలో తోటి ఉద్యోగులు సహాయం చేస్తారు. పని మీద ధ్యాస వుంచండి అన్ని పనులు పూర్తవుతాయి. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలమౌతాయి. ఆదాయ వ్యవహారాలు మెరుగుపడతాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సరైన పెట్టుబడులలో డబ్బు పెట్టండి లాభాలు వస్తాయి. వివాహం కాని వారికి సంబంధం కుదిరే అవకాశం. కుటుంబ సభ్యుల కోసం కొంత సమయం కేటాయించండి వారితో గడపండి. సహోదర వర్గంతో సంబంధాలు గట్టిపడతాయి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో నవ్వుతూ గడపడం ఎంతో ఆనందం ఇస్తుంది

వృషభ రాశి : ధన లాభం ఉంది. కొంత మంది స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు. వివాదాస్పద విషయాల జోలికి వెళ్లి వాదోపవాదాలు చేయకండి. వివాహం కాని వారికి సంబంధం కుదిరే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. నిరుద్యోగులకు శుభవార్త. ఫిట్నెస్ కొరకు యోగ మెడిటేషన్ చేయటం వలన శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నారో తెలుసుకుంటారు.

మిధున రాశి : నూతన వస్త్రాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. సహనమే మీ విజయానికి సూచిక. కొంతమంది జీవితాల్లోకి చిన్ని పాప/ బాబు రాబోతున్నారు. వారికి పేర్లను వెతుక్కోండి. ముఖ్యమైన విషయాల్లో తండ్రిగారి సలహా తీసుకోండి. స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో మార్పు కై ప్రయత్నాలు చేసే వాళ్లు త్వరపడండి. జీతంలో పెరుగుదల. ప్రేమికులు త్వరలో వివాహంతో ఒకటయ్యే అవకాశం. ఈ రాశి స్త్రీలకు మీ భర్తతో వాదోపవాదాలు చిలిపి తగాదాలు గా మారుతాయి.

కర్కాటక రాశి : ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. భయాందోళనలను వదిలివేయండి సహనంగా ఆలోచించండి. యోగా మెడిటేషన్ చేయండి. వ్యాపార విస్తరణకు పాత లావాదేవీలు అడ్డంకిగా మారుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు ఆత్మీయుల సహాయం తీసుకోండి. మీ పిల్లలు చదువు మీద కన్నా వేరే విషయాల మీద శ్రద్ధ పెడుతున్నారు గమనించండి. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

సింహ రాశి : ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శ్రమ వలన ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. మెడ నొప్పి కి అవకాశం. యోగా ఒక ఉపాయం. మీ బంధువులు మీ దగ్గర నుంచి ఏదో భారీగా ఆశిస్తున్నారు. జాగ్రత్త. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టండి అనవసరపు విషయాల జోలికి వెళ్ళకండి. ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు రావలసిన ధనం చేతికందుతుంది. ఏమైనా డాక్యుమెంట్స్ మీద సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా చదవండి ఈ రాశి స్త్రీలకు మీ లేక మీ భర్త యొక్క అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది.

కన్యారాశి : మీ తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా గడపండి. వారు మీ కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని అనుకోని విషయాలు మిమ్మల్ని విచారానికి గురిచేస్తాయి. తొందరపాటు వద్దు ప్రతి విషయాన్ని సహనంతో ఎదుర్కొండి. ఆదాయ వ్యవహారాలు బాగున్నా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. వ్యాపారం లో నూతన పెట్టుబడులకు మంచి అవకాశం ఈ రాశి స్త్రీలకు కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఎంతో ఆనందం ఇస్తుంది.

తులారాశి : వివాహం కాని వారికి సంబంధాలు కుదిరే అవకాశం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపటం మీకు ఎంతో ఎనర్జీ ని ఇస్తుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు కానీ బయట భోజనం వద్దు. ఆఫీసులో తోటి ఉద్యోగుల మీద ఆధారపడటం వలన అన్ని పనులూ ఆలస్యం. కొంతమందికి ఆఫీస్ టూర్స్ ఉండవచ్చు. ఈ కరోనా సమయంలో అనవసర భయాందోళనలను వదిలివేయండి. ఆరోగ్య సమస్యలు లేకున్నా ఫిట్ నెస్ కొరకు ప్రయత్నాలు చేయాలి. కుటుంబ ప్రగతి కొరకు శ్రమ పడతారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

వృశ్చిక రాశి : వివాహం కాని వారికి కోరుకున్న సంబంధం కుదిరి అవకాశం. ఆర్థిక పరిస్థితి పూర్తిగా మెరుగుపడుతుంది. ఇతరులతో కులాసాగా గడపటం మీ సమయం వృధా మరియు పనులన్నీ పెండింగ్ పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఆరోగ్య సమస్యలు లేవు. మానసిక, శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. నూతన వస్త్రములు కొనుగోలు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ఆరోగ్య సమస్య వలన కొంత అశాంతి.

ధనుస్సు రాశి : ఆఫీసు పనులను సరైన ప్రణాళికతో పూర్తిచేయండి. నిర్లక్ష్యం వలన తప్పులు జరిగే అవకాశం. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేకున్నా ఫిట్ నెస్ కొరకు యోగ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. నిరాశ వాద వ్యక్తులను దూరం పెట్టండి. ఎదురుచూస్తున్న రుణాలు చేతికి అందుతాయి. విద్యార్థులకు వారి శ్రమకు తగిన ఫలితం. వివాహేతర సంబంధాల వలన ఇబ్బందులు. ఖరీదైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

మకర రాశి : అనవసర విషయాలపై భార్యాభర్తల మధ్య వాదోపవాదాలు రావచ్చు. యోగ మెడిటేషన్ వలన శారీరక మానసిక ఆరోగ్యం. ప్రతి పనికి ఒక సరైన ప్రణాళిక తప్పనిసరి. పాత బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక విషయాలు మరింత మెరుగు పడతాయి. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. గందరగోళం వదిలేయండి. చదువుపై శ్రద్ధ లేకపోతే విద్యార్థులకు వైఫల్యం. ప్రేమికులు తమ మనసులోని మాట చెప్పటానికి ఆలస్యం చేస్తే నష్టం. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపడం లేదని అశాంతి.

కుంభరాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. కొంతమందికి ఉద్యోగ మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలమౌతాయి. యోగ మెడిటేషన్ వలన శారీరక మానసిక ఆరోగ్యం. బంధువులను మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఈ కరోనా సమయంలో ఆఫీసులో తోటి ఉద్యోగులతో అన్ని జాగ్రత్తలూ తీసుకోండి. ఆర్థిక విషయాలు ఎంతో మెరుగు పడతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కుటుంబ వ్యక్తులతో సహనంతో మాట్లాడండి. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మంచి పాటలు వినడం ఒక ఉపాయం. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

మీన రాశి : మీ ఆరోగ్యం గురించి మీరే ఆలోచించుకోవాలి. యోగా మెడిటేషన్ వలన మానసిక శారీరక ఆరోగ్యం. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ ఇంటి లోకి చిన్ని బాబు /పాప రాబోతున్నారు వారికి పేర్లు వెతకండి. విద్యార్థులకు వారి శ్రమకు తగిన ఫలితం. వ్యాపారం లో నూతన పెట్టుబడులపై అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ పిల్లలు సాధించిన ప్రగతి కుటుంబంలో ఆనందానికి కారణం అవుతుంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed