సింగపూర్‌లో సంక్రాంతి సెలబ్రేషన్స్

152
Singapur-Sanktranthi-celebr

దిశ, మహబూబాబాద్ టౌన్: సింగపూర్‌లో భోగి, సంక్రాంతి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగు పండుగల విశిష్టతను గౌరవిస్తూ సంప్రదాయ బద్ధంగా నిర్వహించుకున్నారు. ఇంటిముందు రంగురంగుల రంగవల్లులు, భోగి మంటలతోపాటు చిన్నారులకు భోగిపళ్లు పోసి భోగి పండుగ విశిష్టత గురించి తెలియజేశారు. తెలుగు కుటుంబాలకు చెందిన కొందరు సింగపూర్లో ఈ వేడుకలను సంప్రదాయ రీతిలో జరుపుకొని అక్కడివారికి పండుగ విశిష్టతను చాటి చెప్పారు. మర్రి ప్రియరాగా, అభిషేక్ రెడ్డి, బోస్ తదితర కుటుంబాలు సంక్రాంత్రి పండుగ వేడుకలను నిర్వహించారు.