పుకార్లు వద్దు.. కోలుకోవాలని ప్రార్థించండి : మాన్యతాదత్

by  |
పుకార్లు వద్దు.. కోలుకోవాలని ప్రార్థించండి : మాన్యతాదత్
X

దిశ, వెబ్ డెస్క్: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆగస్టు 8న ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, సంజయ్ ఆరోగ్యంపై పలు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. వీటిపై స్పందించిన ఆయన భార్య మాన్యతాదత్ ఈ విషయంపై ఎలాంటి ఊహాగానాలు ప్రచారం చేయొద్దని కోరారు. వీలైతే తన భర్త త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలన్నారు.

సంజూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తోన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. మమ్మల్ని దేవుడు మళ్లీ పరీక్షించాడు. గతంలో లాగే ఈసారి కూడా అందులో విజయం సాధిస్తాం. ఈలాంటి పరిస్థితుల్లో మీ ప్రార్థనలు మాకు చాలా అవసరం. అంతే కానీ, పుకార్లు మాత్రం వ్యాప్తి చేయరాదని సంజయ్ దత్ భార్య మాన్యతా దత్ కోరారు.

కాగా, సంజయ్ దత్‌కు ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది తలెత్తెంది. దీంతో ఆయన లీలావతి ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యలు ఆయనకు ముందుగా కొవిడ్ టెస్టు చేయగా నెగెటివ్ అని వచ్చింది. ఆ తర్వాత ఆయన ఊపిరితిత్తుల కాన్సర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. రెండ్రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న సంజయ్ చికిత్స నిమిత్తం కొన్ని రోజులు మూవీ షెడ్యూల్ నంచి విరామం తీసుకుంటున్నట్లు నిన్న ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Next Story

Most Viewed