ఐటెం సాంగ్‌కు సామ్ మరీ అంత రెమ్యునరేషన్ తీసుకుంటుందా…?

by  |
ఐటెం సాంగ్‌కు సామ్ మరీ అంత రెమ్యునరేషన్ తీసుకుంటుందా…?
X

దిశ, సినిమా: విడాకుల ముందు నుంచే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సమంత.. తనకు సంబంధించిన షాకింగ్ న్యూస్‌తో మరోసారి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ మేరకు ‘పుష్ప’ మూవీలో సమంత ఐటెమ్ సాంగ్ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఒక్క పాట కోసం సామ్ ఏకంగా రూ. 1.5 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని సమాచారం.

ఐటమ్ సాంగ్ చేసిన ఏ స్టార్ హీరోయిన్ కూడా ఇంత భారీ రెమ్యునరేషన్ అందుకోలేదు. ఒకవేళ సామ్ నిజంగానే అంత పెద్ద మొత్తం తీసుకుంటే రికార్డే అంటున్నారు సినీ విశ్లేషకులు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.



Next Story