హిందీ ప్రాజెక్టుకు సైన్ చేసిన సమంత..

139

దిశ, సినిమా : హీరోయిన్ సమంత షూటింగ్స్ నుంచి విరామం తీసుకున్న టైమ్‌లో‌నే నాగ చైతన్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామ్.. తిరిగి బిజీ అయ్యే పనిలో ఉంది. ఈ మేరకు పలు బాలీవుడ్‌ ప్రాజెక్టులకు ఓకే చెప్పిందనే వార్తలు వెలువడుతుండగా.. తాజాగా తన ఫస్ట్ హిందీ ఫిల్మ్ కోసం సంతకం చేసిందని, కాస్ట్ అండ్ క్రూ ఫైనలైజేషన్ తర్వాత మేకర్స్ నుంచి అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్ ఉంటుందని తెలుస్తోంది.

‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో హిందీలో అరంగేట్రం చేసిన సామ్.. తన యాక్టింగ్‌తో ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలోనే హిందీ నుంచి ఆఫర్లు వస్తుండటంతో బీటౌన్‌‌పై దృష్టి పెట్టేందుకు వీలుగా ముంబైలో ఒక ఫ్లాట్‌ కొనుగోలు చేసిందని సమాచారం. ఇదిలా ఉంటే, తెలుగులో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’తో పాటు తమిళ్‌లో విజయ్ సేతుపతి ‘కాతువాకు రెండు కాదల్’ షూటింగ్ కూడా పూర్తిచేసింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..