ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేసిన సమంత.. వరల్డ్ ఫస్ట్ ప్లేస్‌‌లో సామ్

by Anukaran |   ( Updated:2021-12-26 23:18:17.0  )
ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేసిన సమంత..  వరల్డ్ ఫస్ట్ ప్లేస్‌‌లో సామ్
X

దిశ, వెబ్‌డెస్క్ : సినిమాలో ఉన్న అన్ని సాంగ్స్ కంటే ఐటమ్ సాంగ్ చరిత్రే వేరుగా ఉంటుంది. ప్రస్తుతం ఐటమ్ సాంగ్ లేకుండా ఏ సినిమా రిలీజ్ కావడం లేదు. అంతే కాకుండా ఐటమ్ సాంగ్‌కు అభిమానులు కూడా ఎక్కువే ఉంటారు. ఇక స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేసిందంటే ఆ సాంగ్ లేవలే వేరుంటది అంటుంటారు. అయితే ప్రస్తుతం పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. విడాకుల తర్వాత, ఓ స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేయడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. అంటూ ఎక్కడ చూసినా సమంత ఐటమ్ సాంగ్ నే హల్ చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఈ సాంగ్ అరుదైన రికార్డను సాధించింది. ప్రస్తుతం ట్రెండీగా కొనసాగుతున్న ఊ..అంటావా సాంగ్ యూట్యూబ్ లో “టాప్ 100 మ్యూజిక్ వీడియోస్ గ్లోబల్” జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఊ.. అంటావా మావా సాంగ్ గత వారం నుంచే నంబర్ 1 సాంగ్‌గా కొనసాగుతుండటంతో అటు సమంత అభిమానులు, ఇటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. తగ్గేదే లేదన్నట్టు తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సాంగ్ మాత్రమే కాక మరిన్ని ‘పుష్ప’ సాంగ్స్ కూడా ఈ లిస్ట్ లో చోటు సాధించుకున్నాయి.

సమంత ఐటమ్ సాంగ్‌పై బ్రహ్మీ ఫన్నీ కామెంట్స్.. వీడియో వైరల్

Next Story

Most Viewed