స్టార్ హీరోల గురించి మాట్లాడగలరా? : సామ్

by  |
స్టార్ హీరోల గురించి మాట్లాడగలరా? : సామ్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని కోడలు సమంత సినీ కెరియర్ సూపర్ హిట్ రికార్డే. నాగచైతన్యతో పెళ్లికి ముందు పెళ్లి తర్వాత సినిమాలు చూస్తే … నటనలో చాలా పరిణితి కనిపిస్తుంది. మ్యారేజ్ తర్వాత ‘రంగస్థలం’, ‘మజిలీ’, ‘యూటర్న్’, ‘ఓ బేబీ’ లాంటి చిత్రాలు చేసిన సామ్… లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన ‘జాను’ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో నెటిజన్లు విమర్శలు కురిపించారు. ‘జాను’తో సమంత కెరియర్ ముగిసిపోయిందని… ఇక కుటుంబాన్ని చూసుకుంటే మంచిదనే కామెంట్స్ వచ్చాయి.

దీంతో మండిపోయిన సామ్.. ఆ కామెంట్స్‌కు ఘాటుగా బదులిచ్చింది. స్టార్ హీరోల సినిమాలు వరుసగా మూడు డిజాస్టర్‌లు అయినా పట్టించుకోని వారు… హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం ఒక్కటి ఆడకపోయినా విమర్శలు గుప్పిస్తారంటూ ఫైరయిపోయింది. హీరోలు వరుసగా ఫ్లాప్ ఇచ్చినా థియేటర్‌కు వెళ్లి సినిమా చూసేవారు… హీరోయిన్ల విషయంలో మాత్రం ఎందుకింతలా కామెంట్స్ చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సామ్ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.

కాగా విజయ్ సేతుపతి, సమంత, నయనతార కాంబినేషన్లో తమిళంలో వస్తున్న ‘కాథువాకుల రెండు కాదల్’ చిత్రంలో చేస్తున్న సామ్.. మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ సినిమాకు ఓకే చెప్పిన సామ్.. యంగ్ యాక్టర్ ప్రశాంత్‌తో జోడీ కడుతోందట. తద్వారా తాను ఇండస్ట్రీలో ఇంకా బిజీగానే ఉన్నానని చెబుతోంది.

Tags: Samantha, Samantha Akkineni, Sam, Fire On Netizens, Social Media


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed