చెఫ్ అవతార్‌లో ‘సామ్’ హెల్తీ టిప్స్!

by  |
చెఫ్ అవతార్‌లో ‘సామ్’ హెల్తీ టిప్స్!
X

దిశ, వెబ్‌డెస్క్ :
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సమతుల ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ఫిట్‌నెస్ కాపాడుకుంటే.. వైద్యుడి అవసరం రాదన్నది తెలిసిందే. ఇటువంటి విషయాల్లో తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికే.. ఉపాసన ‘యుఆర్ లైఫ్.కామ్’తో మనముందుకు వచ్చింది. సమంత కూడా ఇందులో భాగస్వామిగా పనిచేస్తుండగా.. ఈ వెబ్‌సైట్ ద్వారా ఆరోగ్యాన్ని పెంచే వంటల విశేషాలను పోషకాహార నిపుణులు అందిస్తుంటారు. ఈ క్రమంలోనే బ్యూటీ డాల్ సమంత.. హెల్తీ మాస్టర్ చెఫ్‌గా మారి, ఓ ఆరోగ్యకరమైన వంటకాన్ని వివరించింది. ఈ వీడియోను ఉపాసన తన యూట్యూబ్ చానల్‌లో తాజాగా అప్‌లోడ్ చేసింది.

యుఆర్‌లైఫ్. కామ్ ద్వారా గత వారం సమంత వర్క్‌వుట్ టిప్స్ షేర్ చేసిన ఉపాసన.. ఇప్పుడు ఆరోగ్యాన్ని అందించే వంటకాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. బ్రౌన్ రైస్‌తో అదితి మమ్మేన్ గుప్తా అందించిన ట‌మాటో రైస్‌ రెసిపీని నెటిజన్లకు, ఉపాసనకు చాలా డీటెయిల్‌గా వివరిస్తూ.. అదిరిపోయే వంటకాన్ని సిద్ధం చేసింది సమంత. తన డైట్‌లో రైస్ తప్పకుండా ఉంటుందని, కానీ అది పోషకాలు అందించే బ్రౌన్ రైస్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. వీరిద్ద‌రూ త‌మిళంలో మాట్లాడుకోగా, ఉపాస‌న మాట్లాడే త‌మిళం.. త‌న త‌ల్లి మాట్లాడే త‌మిళంలా ఉంద‌ని పేర్కొంది సామ్.

ఇక సామ్ విషయానికొస్తే.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సాకి’ క్లాతింగ్ బ్రాండ్‌ను సోమవారం ఉదయం 9.35 నిమిషాలకు లాంచ్ చేస్తున్నట్లుగా.. స్పెషల్ ఇన్విటేషన్‌ను ఇన్‌స్టాలో పంచుకుంది. ఈ ఓపెనింగ్ సెర్మనీకి సంబంధించిన లైవ్ వీడియో.. తన ఫేస్‌బుక్, యూట్యూబ్ పేజీల్లో 28వ తేదీ సాయంత్రం 6.30 నిమిషాలకు స్ట్రీమ్ అవుతోందని కూడా చెప్పింది.

Next Story

Most Viewed