విడాకుల తర్వాత క్లినిక్ లో సమంత.. బిడ్డల గురించి డాక్టర్ తో చర్చలు..?

710

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత భర్త చైతన్య నుంచి విడిపోయాక మీడియా ముందుకు వచ్చింది లేదు. మరెక్కడ కనిపించింది లేదు. సోషల్ మీడియాలో తన కుక్కపిల్లల ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ, అవసరమైనప్పుడు మాత్రమే స్పందిస్తున్న సమంత ఎట్టకేలకు బయటికొచ్చింది. బుధవారం సామ్ క్లినిక్ లో కనిపించింది. అర్రే.. సామ్ కి ఏమైంది అని కంగారుపడకండి. తన పెంపుడు కుక్కలకు హెల్త్ చెకప్ చేయించడానికి వెటర్నరీ క్లినిక్ కి వెళ్లింది.  తన పెంపుడు కుక్కలు హాష్ మరియు సాషా అంటే సామ్ కి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటినే తన బిడ్డలుగా చెప్తూ వస్తున్న సామ్ వాటిని ప్రాణంగా చూసుకొంటుంది. వెటర్నరీ క్లినిక్ లో సామ్ తన పెంపుడు జంతువులతో ఉన్న ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది. సింపుల్ గా వైట్ టాప్ లో మాస్క్ తో కనిపించింది. విడాకుల తర్వాత సామ్ పబ్లిక్ గా కనిపించడం ఇదే మొదటిసారి.

ఇకపోతే దసరా రోజున సామ్ ఒక ముఖ్య ప్రకటన చేయనున్నట్లు సమాచారం. తన కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అధికారికంగా తెలపనున్నదట. అంతేకాకుండా తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోనున్నదట. ప్రస్తుతం సామ్ ‘శాకుంతలం’ సినిమాను పూర్తిచేసింది. ఇక ఇటీవలే ఒక బాలీవుడ్ సినిమాకు అమ్మడు సైన్ చేసినట్లు తెలుస్తోంది. మరి రేపు సామ్ ఏం చెప్పబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..