‘మూడు ప్లాపులు వస్తే.. హీరోయిన్ కెరీర్ ఎండ్’

by  |
‘మూడు ప్లాపులు వస్తే.. హీరోయిన్ కెరీర్ ఎండ్’
X

అక్కినేని వారి కోడలు, తెలుగు నాట స్టార్ హీరోయిన్ సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. వరుస హిట్‌లతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల ఇమేజ్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. హీరోల మాదిరిగా సమంత కూడా ఫ్యాన్స్ బేస్ ఓ రేంజ్‌లో ఉంటుంది. పెళ్లి తర్వాత కూడా ఈ స్థాయి ఇమేజ్ మెయింటేన్ చేయడమే ఈమె ప్రత్యేకత. ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సామ్ మట్లాడుతూ.. హీరోల విషయానికి వస్తే.. ఫ్లాపులు వచ్చినా కూడా హీరోలకు ఎలాంటి ఢోకా ఉండదని.. కానీ హీరోయిన్లకు మూడు నాలుగు ఫ్లాపులు వస్తే కెరీర్ కథ ముగిసినట్టే అని అంటుంది. కథానాయికలు ఎంత కష్టపడినా ప్రేక్షకులకు నచ్చదని సూటిగానే చెప్పుకొచ్చింది సమంత. ఏదో ఓ సినిమా హిట్ అయింది కదా అని హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు వరసగా తీస్తే ప్రేక్షకులు చూడరని స్పష్టంగానే చెప్పింది. అదే ఓ స్టార్ హీరో స్క్రీన్‌పై అలా నడుచుకుంటూ వస్తే చాలు ప్రేక్షకులు పిచ్చెక్కిపోతారు. హీరోలకు ఉండే క్రేజ్ అలాంటిది అని అంటుంది. స్టార్ హీరోలకి వరుసగా మూడు నాలుగు ఫ్లాపులు వచ్చినా కూడా ఫ్యాన్స్ చూస్తారు.. కానీ హీరోయిన్ల విషయంలో అది కుదరదని సుత్తి లేకుండా మ్యాటర్ కుండ బద్ధలు కొట్టింది. తన విషయమే తీసుకోండి.. ఓ బేబీ హిట్ అయింది కదా అని తాను సోలోగా నటించిన సినిమాలు హిట్ అవుతాయనే గ్యారెంటీ లేదని చెప్పింది. అన్నట్టుగానే యూటర్న్‌తో పాటు జాను సినిమా కూడా డిజాస్టరే. స్టార్ హీరోకి ఉండే అట్రాక్షన్‌లో కనీసం ఒక శాతం కూడా హీరోయిన్స్‌కి ఉండదని తేల్చేసింది. ఈమె మాటలు వినడానికి కాస్త కఠినంగా అనిపించినా కూడా ఇదే నిజం. అనుష్క లాంటి హీరోయిన్లకు కూడా ఇప్పుడు గడ్డుకాలం నడుస్తుందంటే సమంత చెప్పిన కారణాలే నిజమే అనిపిస్తోంది.

Tags: star heros, flops, hits, samantha, End of movie life, heroins, Attraction

Next Story

Most Viewed