హైదరాబాద్‌లో సల్మాన్ హల్ చల్.. పుల్ ఖుషి అవుతున్న ఫ్యాన్స్..

by  |
హైదరాబాద్‌లో సల్మాన్ హల్ చల్..  పుల్ ఖుషి అవుతున్న ఫ్యాన్స్..
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఈ రోజు హైదరాబాద్‌లో దర్శనమిచ్చాడు. తన లేటెస్ట్ మూవీ ‘అంతిమ్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా నగరానికి వచ్చిన సల్మాన్.. కూకట్‌పల్లిలోని సుజన ఫోరం మాల్‌లో సందడి చేశాడు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి సిటీలోకి ఎంటరైన కండల వీరుడికి ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో తీసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘హైదరాబాద్‌లో మోస్ట్‌ హ్యాండ్సమ్‌ హంక్‌ సల్మాన్‌ ఖాన్‌’ అంటూ తెగ మురిసిపోతున్నారు.

కాగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఫోరం మాల్‌లో ‘అంతిమ్‌’ సినిమా చూసేందుకు సల్మాన్‌ రానున్నట్లు ముందే చెప్పిన పీవీఆర్‌ యాజమాన్యం.. ‘ప్రతీ ఒక్కరు టికెట్ కొనుక్కొని సల్మాన్‌తో సినిమా చూసేందుకు సిద్దంగా ఉండండి’ అంటూ ట్విట్టర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed