పెన్షన్‌దారులకు గుడ్ న్యూస్.. ఆ రోజుల్లో కూడా నగదు తీసుకోవచ్చు

by  |
పెన్షన్‌దారులకు గుడ్ న్యూస్.. ఆ రోజుల్లో కూడా నగదు తీసుకోవచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగులు, పెన్షన్‌దారులు ఇకమీదట జీతాలు, పెన్షన్ వంటి వాటిని సెలవు రోజుల్లో కూడా తీసుకునే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనల్లో మార్పులు చేసింది. ఇప్పటివరకు జీతాలు, పెన్షన్ తీసుకునేందుకు, ఈఎమ్ఐ లాంటి చెల్లింపులకు బ్యాంకు సెలవు రోజుల్లో వీలయ్యేది కాదు. తాజాగా ఆర్‌బీఐ ఈ నిబంధనల్లో మార్పులు చేయడంతో ఆగష్టు 1వ తేదీ నుంచి ఉద్యోగులు, పెన్షన్‌దారుల ఖాతాల్లోకి అన్ని రోజుల్లో జీతం, పెన్షన్ నగదు చేరనుంది.

ఎన్ఏసీహెచ్ నిబంధనలో కొత్త మార్పులు ఆగష్టు 1 నుంచి అమలు కానున్నాయి. దీనివల్ల జీతం, పెన్షన్, ఈఎమ్ఐ, గ్యాస్ బిల్లులు, టెలిఫోన్ బిల్లులు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లాంటివి 1వ తేదీన కూడా జమ కానున్నాయి. గతంలో జీతం, పెన్షన్ నగదు తీసుకోవాలంటే బ్యాంకు పనిదినాల్లో మాత్రమే తీసుకునేందుకు అవకాశం ఉండేది. జూన్ నెల ద్రవ్య ప‌ర‌ప‌తి స‌మీక్ష‌లో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వినియోగదారులకు అందించే సేవలను మరింత పెంచేందుకు గానూ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్(ఆర్‌టీజీఎస్), ఎన్ఏసీహెచ్ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.

Next Story

Most Viewed