ఆర్టీసీ బస్సులో స్టెప్పులేసిన సజ్జనార్.. వీడియో వైరల్

by Anukaran |
Sajjanar
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రజారవాణా ఆర్టీసీని తిరిగి లాభాల బాటలో పట్టించేందుకు ఎండీ సజ్జనార్ ఎన్నో కీలక మార్పులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ అలర్ట్ గా ఉండే సజ్జనార్ యూత్ ని ఆకర్షించేందుకు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రమోట్ చేయడంలో భాగంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ఫ్యామిలీతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ టిక్ టాక్ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో కుటుంబసమేతంగా సజ్జనార్ స్టెప్పులేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సు సురక్షితమని తెలియజేసేలా ఆయన సందేశాన్నిచ్చారు. సజ్జనార్ స్టెప్పులేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలో సంస్థ మనుగడకు సజ్జనార్ చేస్తున్న పనులను నెటిజన్లు అభినందిస్తున్నారు.

Next Story

Most Viewed