- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎం జగన్‌తో సజ్జల, బుగ్గన భేటీ.. పీఆర్సీపై రేపటిలోగా ఓ క్లారిటీ వచ్చే అవకాశం..

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాలతో రెండు రోజులుగా జరుగుతున్న చర్చల గురించి సీఎంకు వివరించారు. ఉద్యోగులకు ఎంతమేర పీఆర్సీ ఇవ్వాలనే అంశంపై సీఎం తో చర్చించారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు.. పీఆర్సీ రద్దు పై వస్తున్న విమర్శలపై చర్చించారు. ఉద్యోగుల డిమాండ్ల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎంత భారం పడుతుంది..? అందుకు నిధుల సమీకరణపై కూలంకషంగా చర్చించారు.
అనంతరం ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఉద్యోగుల వేతనం తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని.. అలాగే ఇతర డిమాండ్ల పరిష్కారం పైన సీఎంతో చర్చించినట్లు చెప్పుకొచ్చారు. సీఎస్ కమిటీ సిఫార్సు 14.29 ఫిట్‌మెంట్ అమలుచేస్తూ ఐఆర్‌కు రక్షణ కల్పించే అంశంపై చర్చిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పీఆర్సీ ఉంటుందని.. ఉద్యోగులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భారీ అంచనాలు అయితే లేదు కానీ ఉద్యోగులకు నష్టం లేకుండా చూస్తామన్నారు.
కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుంటే ఉద్యోగులను సంతృప్తి పరిచేలా నిర్ణయం తీసుకునేవారిమన్నారు. గతంలో, ఇతర రాష్ట్రాలతో పోల్చుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదని వెల్లడించారు. త్వరలోనే ఈ అంశానికి తుది రూపు ఇస్తామన్నారు. ఈ ఉద్యోగ సంఘాలు మరో మారు సీఎస్‌తో భేటీ అయి ఆందోళనపై నిర్ణయం తీసుకుంటారన్న సజ్జల.. సీఎం ఉద్యోగులకు మేలు చేయాలనే మనస్తత్వంతో ఉన్నారని మరోసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పునరుద్ఘాటించారు. శుక్రవారం లేదా సోమవారం ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యే అవకాశం ఉందన్నారు. సమావేశంలో సీఎం జగన్ ఓ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. మెుత్తానికి పీఆర్సీ అంశం సోమవారం డెడ్ లైన్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.