నేడు సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు

by srinivas |   ( Updated:2021-12-11 21:13:50.0  )
నేడు సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు జరగనున్నాయి. అతని స్వగ్రామం ఎగువరేగడలో సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ఎగువరేగడకు సాయితేజ భౌతికకాయం చేరుకోనుంది. మదనపల్లి నుంచి ఎగువరేగడ వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగనుంది. మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంతో డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ దంపతులతో సహా 13 మంది మరణించారు. ఆ ప్రమాదంలో ఏపీకి చెందిన సాయితేజ కూడా మరణించారు. బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతాధికారిగా సాయితేజ వ్యవహరించారు.



Next Story

Most Viewed