వరంగల్ కమిషనరేట్ లా&ఆర్డర్, ట్రాఫిక్ అదనపు డీసీపీగా సాయి చైతన్య

by  |

దిశ, ములుగు: ములుగు సబ్ డివిజినల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సాయి చైతన్యను వరంగల్ కమిషనరేట్ లా&ఆర్డర్, ట్రాఫిక్ అదనపు డీసీపీగా అటాచ్ మెంట్ చేస్తూ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు. 2016 సంవత్సరం ఐపీఎస్ బ్యాచ్ కు చెంది సాయి చైతన్య ములుగు జిల్లా ట్రైనీ ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహించడంతోపాటు ప్రస్తుతం ములుగు సబ్ డివిజన్ అధికారిగా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. గత ఏడాది మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించడంలో సాయి చైతన్య కీలక పాత్ర పోషించారు.

Next Story

Most Viewed