కుక్క ఫీల్డింగ్ నైపుణ్యాలకు.. క్రికెట్ గాడ్ సచిన్ ఫిదా!

by  |
కుక్క ఫీల్డింగ్ నైపుణ్యాలకు.. క్రికెట్ గాడ్ సచిన్ ఫిదా!
X

దిశ, ఫీచర్స్: క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్రావీణ్యముంటే ఆల్‌రౌండర్‌గా పరిగణిస్తాం. అయితే కీపింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అదరగొడితే ఎలా ఉంటుంది? అది అసాధ్యమంటారా? కానీ ఓ టాలెంటెడ్ డాగ్.. ఈ రెండు అంశాల్లోనూ అదరగొట్టడం క్రికెట్ గాడ్ సచిన్ దృష్టిని ఆకర్షించింది. మైదానంలో పాదరసంలా పరుగెత్తుతూ బాల్‌ను పట్టుకుంటున్న ఆ శునకానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పంచుకున్న క్లిప్‌లో.. ఒక చిన్న అమ్మాయి పల్లెటూరి వాతావరణంలో క్రికెట్ ఆడుతూ కనిపించింది. అందులో వికెట్ కీపర్‌గా ఓ కుక్క ఉండగా, బ్యాట్స్‌మెన్ బంతిని కొట్టడమే ఆలస్యం.. వెంటనే పరుగెత్తుతూ బాల్ ఇచ్చేసి, మళ్లీ వికెట్ కీపింగ్ చేస్తుండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు బ్యాట్స్‌మెన్ పిచ్‌కు అడ్డంగా బంతిని కొట్టినప్పుడు ఫర్రి ప్లేయర్ ఫీల్డర్‌గా ఛేజింగ్‌ రెట్టింపు చేస్తూ పరుగులు తీస్తుండటం నిజంగా వావ్ అనిపిస్తోంది. టెండూల్కర్‌ ఈ వీడియోను షేర్ చేయడంతో పాటు డాగ్ ఫీల్డింగ్, క్యాచింగ్ నైపుణ్యాల గురించి వ్యాఖ్యానించకుండా ఉండలేకపోయాడు. ‘క్రికెట్‌లో వికెట్ కీపర్స్, ఫీల్డర్స్, ఆల్ రౌండర్స్ చూశాము. అయితే మీరు దీనికి ఏ పేరు పెడతారు?’ అంటూ సచిన్ తన ఫాలోవర్స్‌ను అడిగాడు.


Next Story

Most Viewed