స్కూల్‌కి వచ్చిన మంత్రి సబితా.. క్లాసు రూములోనే బాగుందంటూ..

110

దిశ, పరిగి: పరిగి మున్సిపాలిటీ పరిధిలోని బాలికల ఉన్నత పాఠశాలను గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో మాట్లాడుతూ.. లాక్‎డౌన్ అనంతరం ప్రత్యక్ష తరగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు పెరుగుతున్నందున, అన్ని రకాల కొవిడ్ జాగ్రత్తలు పాటించాలన్నారు. ముఖ్యంగా భోజనం సమయంలో శుభ్రంగా చేతులు శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష తరగతుల నిర్వహణ బాగుందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. మంత్రి వెంట పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..