టార్గెట్ రూ.6 లక్షల కోట్లు.. భారీ ఆదాయంపై కన్నేసిన మోడీ సర్కార్

by  |
టార్గెట్ రూ.6 లక్షల కోట్లు.. భారీ ఆదాయంపై కన్నేసిన మోడీ సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ పైప్‌లైన్లు, జాతీయ రహదారుల సహా ఇతర ప్రాజెక్టుల నుంచి ఆదాయం కోసం రూ. 6 లక్షల కోట్ల అసెట్ మానిటైజేషన్ ప్రణాళికపై ప్రభుత్వం సన్నాహాలు చేపడుతున్నట్టు దీపమ్ కార్యదర్శి అన్నారు. ఇప్పటికే పవర్‌గ్రిడ్ పైప్‌లైన్లను మానిటైజ్ చేసేందుకు ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టును ప్రారంభించినట్టు ఇన్వెస్ట్‌మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం(దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే బుధవారం వెల్లడించారు. ఎయిర్‌పోర్టుల నిర్వహణలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఈ క్రమంలో రైల్వేస్టేషన్లను విస్తరించాలనుకుంటున్నట్టు చెప్పారు.

ఈ నేపథ్యంలోనే అసెట్ మానిటైజేషన్‌లో భారీ ఎత్తున ప్రైవేట్ భాగస్వామ్యం ఆశిస్తున్నట్టు చెప్పారు. అసెట్ మేనేజ్‌మెంట్ అంటే ప్రభుత్వ ఆస్తులను నగదు రూపంలోకి మార్చుకోవడం. ఇందులో ఇదివరకే పూర్తయిన మౌలిక సదుపాయాల పథకాలను విలువ ప్రకారం ప్రైవేట్ కంపెనీలకు ఇస్తారు. వారు వినియోగదారుల నుంచి ఆదాయాన్ని సమకూరుస్తారు. అలాగే, ఈ ఏడాది ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) ప్రైవేటీకరణను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తుహిన్ కాంత పాండె చెప్పారు. ఇదే సమయంలో 2022, మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలోగా ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ లిస్టింగ్‌ను చేయనున్నట్టు, డివిడెండ్ రూపంలో రూ. 50 వేల కోట్లను సేకరించాలని తెలిపారు.


Next Story

Most Viewed