నాని సినిమా సెట్‌కు రూ. 6.5 కోట్ల ఖర్చు!

by  |
నాని సినిమా సెట్‌కు రూ. 6.5 కోట్ల ఖర్చు!
X

దిశ, సినిమా : నేచురల్ స్టార్ నాని హీరోగా ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’. ఈ చిత్రం నాని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుండగా.. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ అవినాశ్ కొల్లా హైదరాబాద్‌లోనే కోల్‌కతాను తలపించే భారీ సెట్ రూపొందించారు.

రూ.6.5 కోట్ల ఖర్చుతో పది ఎకరాల విస్తీర్ణంలో వేసిన సెట్‌లో చిత్రీకరిస్తున్న యాక్షన్ స‌న్నివేశాలు సినీప్రియుల‌కు కొత్త అనుభూతినిస్తాయని మూవీ యూనిట్ పేర్కొంది. నిహారిక ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. జిషు సేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా నేష‌న‌ల్ అవార్డ్ విన్నర్ నవీన్‌ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్‌ చేస్తుండటం విశేషం.

Next Story

Most Viewed