ఉమ్మడి పాలమూరుకు రూ.32 కోట్ల నిధులు

by  |

దిశ, మహబూబ్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు రూ.32,08,26,800 విడుదలయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1692 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఈ నిధులను వీటికి కేటాయించనున్నారు. ఇటీవల నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయతీల సమస్యలపై ప్రభుత్వానికి నివేదికలు వెళ్లాయి. జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపులు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
జిల్లాల వారీగా నిధుల కేటాయింపులను పరిశీలిస్తే.. మహబూబ్ నగర్ జిల్లాకు రూ.7,42,61,700, నారాయణపేట జిల్లాకు రూ.5,47,71,500, వనపర్తి జిల్లాకు రూ.5,22,17,600, జోగుళాంబ గద్వాల జిల్లాకు రూ.5,50,93,000, నాగర్ కర్నూల్ జిల్లాకు రూ.8,44,33,600ల నిధులు మంజూరు అయ్యాయి. కాగా, నెల క్రితమే కేంద్ర ప్రభుత్వం నుంచి 14వ ఆర్థిక సంఘం నిధులూ పంచాయతీలకు విడుదలయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రం వాటా కూడా రావడంతో పంచాయతీల్లో అభివ‌ృద్ధి పనుల వేగం పెరిగే అవకాశం ఉంది.

Tags: panchayat funds, release, mahabubnagar, ts govt

Next Story

Most Viewed