Apollo Hospital: అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. రూ.24 లక్షలు కడితేనే డెడ్‌బాడీ!

by  |
Apollo Hospital: అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. రూ.24 లక్షలు కడితేనే డెడ్‌బాడీ!
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా ట్రీట్మెంట్ సామానుడ్యికి భారంగా మారింది. ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలు సరిగా ఉంటాయో లేదో అని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిన కరోనా రోగి బంధువులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వైద్యం కోసం ఆస్పత్రి యాజమాన్యాలు రూ.లక్షలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్‌లోని అపోలో ఎదుట కొవిడ్ రోగి బంధువులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకివెళితే.. జనగామకు చెందిన నాగరాజు అనే వ్యక్తికి కరోనా సోకడంతో అతన్ని అపోలో హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ అతను శుక్రవారం మృతి చెందాడు.

అయితే, అపోలో ఆస్పత్రి వారు బిల్లు రూ. 24లక్షలు వేశారు. ఇప్పటికే అందులో రూ.9 లక్షలు వైద్యం కోసం రోగి బంధువులు చెల్లించారు. మృతదేహాన్ని తీసుకెళ్లాలంటే మిగతా డబ్బు చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు డిమాండ్ చేయడంతో రోగి తరపు బంధువులు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే నాగరాజు చనిపోయాడని వారు ఆరోపిస్తున్నారు.

Next Story