సెకెండ్ వేవ్ ఎఫెక్ట్.. రూ. 2 లక్షల కోట్ల నష్టం

by  |
సెకెండ్ వేవ్ ఎఫెక్ట్.. రూ. 2 లక్షల కోట్ల నష్టం
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థికవ్యవస్థకు సుమారు రూ. 2 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆర్‌బీఐ తన నెలవారీ బులిటెన్‌లో వెల్లడించింది. చిన్న పట్టణ ప్రాంతాలు, గ్రామాలకు సైతం కరోనా వైరస్ చేరుకోవడంతో తీవ్ర నష్టం ఏర్పడిందని ఆర్‌బీఐ బులిటెన్‌లో పేర్కొంది. ఈ ఏడాది ఆర్థికవ్యవస్థ తిరిగి పుంజుకుంటున్న క్రమంలో సెకెండ్ వేవ్ వల్ల తిరిగి ప్రతికూలతను ఎదుర్కొందని, ముఖ్యంగా దేశీయంగా డిమాండ్ తీవ్రంగా దెబ్బతిన్నదని ఆర్‌బీఐ తెలిపింది. అయితే, గత ఆర్థిక సంవత్సరంతో పోల్చినపుడు కరోనా సెకెండ్ వేవ్ సమయంలో కాంటాక్ట్‌లెస్ సేవలు, ఎగుమతులు, పారిశ్రామికోత్పత్తి మెరుగుపడిందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. రాబోయే రోజుల్లో టీకా ప్రక్రియ వేగవంతంగా ఉంటుందని, త్వరలో ఆర్థికవ్యవస్థ సవాళ్ల నుంచి బయటపడుతుందని ఆశిస్తున్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది.

Next Story